Guppedantha Manasu Today Episode

ఇప్పుడు guppedantha manasu today episode (గుప్పెడంత మనసు సీరియల్ ౨౩ సెప్టెంబర్ ఎపిసోడ్) లో ఎం జరిగిందో తెలుసుకుందాం.

సరికొత్తగా ప్రారంభం అయినా, మన అందరిని ఎంతగానో అలరిస్తున్న సీరియల్ “గుప్పెడంత మనసు”. నేటి ఎపిసోడ్, 250 వ ఎపిసోడ్ కావటం ఎంతో విశేషం.

అయితే గత ఎపిసోడ్ లో అందరు బాధ పడటాన్ని మనం చూసాము. కారణం లేకుండా తాను వాసు ని తిట్టాను అని రిషి బాధ పడటం ఒక ఎత్తు అయితే, తన తండ్రి మొట్ట మొదటిసారి తనని తిట్టటం, అది కూడా జగతి విషయంలో…ఈ పరిస్థితులు రిషిని కలచి వేస్తున్నాయి.

నిన్నటి హైలైట్స్

ఈ రోజు (guppedantha manasu today episode) ఎపిసోడ్ లో ఏమవుతుందో తెలుసుకునే ముందు, అంతక ముందు ఎపిసోడ్ యొక్క హైలైట్స్ చూద్దాము.

‘ఈరోజు రిషి మూడ్ ఏం బాలేనట్లుగా ఉంది దేవయానీ’ అంటూ తనకు అనిపించింది చెబుతాడు. దాంతో అడగకపోయారా ఏం అయ్యిందో అని.. అంటూ కంగారుపడుతుంది. ‘దేవయానీ.. అసలు అలా ఎవరైనా అడుగుతారా? సంతోషంగా ఉన్న మనిషిని ఎందుకు సంతోషంగా ఉన్నావ్ అని అడగొచ్చు కానీ.. బాధగా ఉన్నవాడి దగ్గరకు అడగడం కరెక్ట్ కాదు దేవయానీ’ అంటూ క్లాస్ పీకుతాడు.

ఇక ఫణేంద్ర వెళ్లగానే.. ‘రిషికి కాల్ చేసి ఆ వసుధర నా గురించి ఏదైనా చెప్పేసిందో అడుగు’ అంటుంది దేవయాని. తాను ఎంత మోస గత్తో తెలిసిన, అత్తయ్య కాబట్టి, కొంచం సహనంతో, ‘అత్తయ్యా చెయ్యమంటే చేస్తాను కానీ.. దాని వల్ల మనకే సమస్య అత్తయ్యా.. వసుధర ఏం చెప్పకపోతే.. మనమే చెప్పినట్లు అవుతుంది. ఇంకా రిషికి కూడా మన మీద, ముఖ్యంగా మీ మీడ్స్ అనుమానం వస్తుంది’ అంటుంది. దాంతో అది నిజమే అని దేవయాని కొంచం కూల్ అవుతుంది.

రిషికి ఒక కొత్త పాఠం నేర్పించనున్న వసుధారా..

ముందు కొంచం అలిగిన సరే, రిషి తో రెస్టాఉరంట్ కి వెళ్తుంది వసు. అయితే, అక్కడ కొంచం కొత్తగా అలోచించి, కాఫీ మరియు ఐస్ క్రీం తెప్పిస్తుంది. కాఫీ మీ కోపం, ఐస్ క్రీమ్ మీ మంచితనం అంటూ.. రెండు ఒకేసారి ఎలా బాగుండదో.. మీ కోపం ప్రేమ ఒకేసారి బాగుండవు సార్’ అని ఓ పాఠం నేర్పించాలని ప్రయత్నిస్తుంది. కానీ మిస్టర్ ఇగో.. తగ్గేదే లే అనుకుంటూ రెండు ఒకేసారి తిని, తాగి వసుకి షాకిచ్చాడు. రెండు కలిసి ట్రై చేస్తే బాగుంది అంటూ గాలి తీసేశాడు. కోపిష్టి గురించి తెలిసిందే కదా అని వెళ్పోతుంది వసుధారా.

ఇక ధరణి అనుమానంతో వసుకి కాల్ చేస్తుంది. అయితే వసు చాలా సంతోషంగా మాట్లాడటంతో.. ‘వసు దేవయానితో గొడవ గురించి రిషికి ఏం చెప్పి ఉండదు’ అని ఫిక్స్ అవుతుంది. సరిగ్గా అప్పుడే రిషి ఇంటికి వచ్చి.. మహేంద్ర ఇంటికి రాలేదని తెలుసుకున్న తర్వాత.

ధరణి కి, కాఫీ, ఐస్ క్రీమ్ స్టోరీ చెప్పి వసు తాగించింది అని చెప్పుకుండానే కొత్తగా ట్రై చేశాను అంటాడు. అయితే ధరణి గెస్ చేస్తుంది. వసు తాగించిందా? అని. ఇక రిషి.. ‘వదినా మీకు వసుధర ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయి.. తగ్గించుకోండి’ అని సలహా ఇచ్చి ముందుకు కదలుపుతాడు. దాంతో ధరణి ఆశ్చర్యంగా.. ‘అరే ఇదేంటి తను ఎక్కువ ఆలోచిస్తూ నన్ను ఆలోచించొద్దు అంటున్నాడు’ అనుకుంటుంది మనసులో.

ఇక నేటి ఎపిసోడ్ లో ఎం జరిగిందో తెలుసుకుందాం.

guppedantha manasu today episode (నేటి ఎపిసోడ్ హైలైట్స్)

జగతి ఏమో ఏడుస్తూ మహేంద్రని అలా వెళ్లిపోమని ఉండకూడదు అనుకుంటూ మహేంద్రకు కాల్ చెయ్యాలని ప్రయత్నిస్తుంది. సరిగ్గా అప్పుడే శిరీష్ వచ్చి మెషిన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతుంటే.. కాఫీ పెట్టి ఇస్తూ మాట్లాడుతూ ఉండిపోతుంది. వసు వచ్చి ఎప్పటిలానే శిరీష్‌తో వెటకారాలు ఆడుతుంది.

రిషి కోపం తగ్గింది సరే. వాసు కూడా ఆనందం గానే ఉంది. వీళ్ళ ఇద్దరి గురించి పక్కన పెడితే, ఒక విషయం మన అందరం గమనించాల్సింది ఏమంటే, మహీంద్రా కనిపించక పోవటం.

ఇంతకీ మహీంద్రా ఏమయినట్టు?

ఒక రోజు పూర్తయి పోయిన, తన తండ్రి ఇంటికి రక పోయే సరికి, జగతి తో ఉన్నడేమో అని అనుమానిస్తాడు. ఆ అనుమానంతోనే, తన తల్లి ఇంటికి పట్టా రాణి కోపం తో వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే, ఇంటి కాలింగ్ బెల్ కొట్టి,ఆయన ఎక్కడ అని ప్రశ్నిస్తాడు. అప్పుడు జగతి కి తెలుస్తుంది, మహీంద్రా క్రితం రోజు నుంచి ఇంటికి వేళ్ళ లేదని.

భయ పడుతూనే, తాను ఇక్కడికి నిన్న వచ్చిన, తిరిగి వెళ్ళిపోమంది అని రిషి కి చెపుతుంది జగతి. ఆలా ఎందుకు చేసారు మీరు, నాన్న గారు నిన్నటి నుంచి ఇంటికి రాలేదు. ఇదంతా మీ వల్లే జరిగింది. ఇప్పుడు ఆయన ఎక్కడ వున్నారో కూడా తెలియట్లేదు.

అని విచారం తో, చిరాకు గా, ఒక పక్క భయం తో ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. వీళ్ళ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ అంత, వసుధారా వింటుంది. ఒక పక్క జగతి ఏమో, తన వల్లే ఇదంతా జరిగింది అని, తాను ఇంకా ఇంకా రిషిని బాధ పెడుతుంది అని, మరింక బాధ పడుతుంది.కోపం తో నే రిషి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక అందరు, మహీంద్రా ఏమయ్యాడు అన్న సందిగ్ధం లో పడతారు. రిషి ఎన్ని సార్లు ఫోన్ ట్రై చేసిన, కలవక పోవటం తో, అతని ఆవేదన ఇంకా ఎక్కువ అవుతుంది.

ఈ ఏపిసోడ్ (guppedantha manasu today episode)లో అందరు, వెతుకుతూ ఉండగా, వసుధారా రిషి కి వెతక మని సలహా ఇస్తుంది.   దాని తో రిషి కోపం ఇంకా పెరుగుతుంది. ఇక మహీంద్రా ఎక్కడ వున్నదో అన్నది మనం తెలుసుకోవాల్సి ఉంది.

ముగింపు

నేటి ఎపిసోడ్ (guppedantha manasu today episode) లో, అందరు మహీంద్రా గురించి విచారిస్తున్నారు. మరి కొన్ని వివరాలు, తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకున్నాము.

ఈ సీరియల్ ని మీరు, మా టీవీ లో మరియు డిస్నీ+ హాట్స్టార్ లో చూడొచ్చు.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GDPR compliant site tracker